తెలంగాణ ఎక్స్ ప్రెస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం: మియాపూర్ లోని శుభం బ్యాంకెట్ హాల్ లో శేరిలింగంపల్లి నియోజకవర్గ తెలంగాణ రక్షణ సేన పార్టీ ఇంచార్జ్ వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ ఆధ్వర్యంలో శుక్రవారం మీట్ ది ప్రెస్ కార్యక్రమం ఏర్పాటుచేసారు. ఈ కార్యక్రమంలో వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ మాట్లాడుతూ, గత బి ఆర్ ఎస్ పార్టీకి అన్ని విధాలుగా ఎంతో న్యాయం చేసినప్పటికీ తనకు మాత్రం తగిన గుర్తింపు లభించనందువల్లె తాను పార్టీ మారానని, కనీస గౌరవం కూడా లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి చేదోడు వాదోడుగా ఉంటూ ఎంతో మందికి సాయం చేశానని, తన సేవలను గుర్తించలేదని, అందుకే ఆ పార్టీ మీద నాయకుల మీద తనకు నమ్మకం లేదని తెలిపారు. గత పదేళ్లలో ఏనాడు స్థానిక నాయకులకు ఒక్క నామినేటెడ్ పోస్ట్ ఇవ్వకుండా అన్యాయం చేశారన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండా ఎగురవేస్తామని స్పష్టం చేశారు. ఇక నుండి తెలంగాణ రక్షణ సేన ను క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం దిశగా అడుగులు వేస్తామని, అన్ని డివిజన్ కమిటీలు వేసి రానున్న జి హెచ్ ఎం సి ఎన్నికల్లో పోటీకి దిగుతామని పేర్కొన్నారు. ఇప్పుడే ఆరంభం ఇక ముందుంది అసలు కార్యాచరణ అన్నారు.
