న్యూస్ డెస్క్ : మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మోడల్ స్పోర్ట్స్ స్కూల్ నందు నిర్వహించబడుతున్న వేసవికాలం క్రీడా శిబిరాన్ని ట్రైబల్ వెల్ఫేర్ ఉప సంచాలకులు దేశీరాం నాయక్ సందర్శించారు. ఈ యొక్క సమ్మర్ క్యాంపులో నేర్పించవలసినటువంటి కబడ్డీ వాలీబాల్ కోకో అథ్లెటిక్స్ హ్యాండ్ బాల్ బాస్కెట్బాల్ వ్యాయమ ఉపాధ్యాయులను సలహాలు సూచనలు ఇవ్వడం జరిగినది అలాగే పాఠశాల నుండి రాష్ట్రస్థాయి క్రీడా పోటీలో పాల్గొనీ మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్న విద్యార్థులను అభినందించారు ఈ సమావేశంలో డిడి గారితో పాటు ATDO కొత్తగూడ R.భాస్కర్ స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు డిప్యూటీ DEO D.సారయ్య స్పోర్ట్స్ ఆఫీసర్ కొమ్మాలు సీనియర్ ఉపాధ్యాయులు బి దేవిలాల్ అలాగే వ్యాయామ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.