కేంద్రంలో ప్రపంచ 141వ మే డే వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా బ్రదర్స్ లిమిటెడ్ బీడీ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమం
న్యూస్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రంగారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కేంద్ర ప్రభుత్వంపై పరోక్షంగా, ప్రత్యక్షంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిష్టాపురం లక్ష్మణ్, నాయకులు సంపత్, మల్లేశం, బిక్షపతి, చంద్రం తదితరులు పాల్గొన్నారు.
