తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్: ప్రముఖ దర్శకుడు దీక్షిత్ మీర్జాపురం దర్శకత్వంలో ఓ కొత్త ప్రేమకథా చిత్రం ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో గతంలో చిత్రం సీను, పీడీ, వెంకీ, బొమ్మరిల్లు, ఆర్య, మిస్టర్ మిడిల్ క్లాస్, పొలిమేర-2 వంటి చిత్రాల్లో నటించిన చిత్రం సీను కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఈ సినిమాలో కిరణ్ గౌడ్ (గగన్‌పహాడ్), యేష్ మాస్టర్, ప్రశాంత్ యాదవ్ గోదాలి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఈ చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు కొత్త హీరో, కొత్త హీరోయిన్‌ను పరిచయం చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
షంషాబాద్ సమీపంలోని ధర్మగిరి ఆలయం పరిసర ప్రాంతాల్లో సినిమా చిత్రీకరణ జరగనుంది. ప్రేమ, కుటుంబ భావోద్వేగాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక బృందం, విడుదల తేదీ తదితర పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.