తెలంగాణ ఎక్స్‌ప్రెస న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, కొండాపూర్ డివిజన్ పరిధిలోని మస్తాన్ నగర్ కాలనీలో నిర్వహించిన “వన్ డే-వన్ వార్డ్” కార్యక్రమం ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమంలో భాగంగా కాలనీలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పన, పారిశుధ్యం, డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాలు, తాగునీటి సరఫరా, పార్కుల అభివృద్ధి తదితర అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, కొండాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ హమీద్ పటేల్ , సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఐఏఎస్ అధికారి శ్రీమతి జి. సృజన , జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్, డిప్యూటీ కమిషనర్ బాలకృష్ణ , సీఎంసీ పరిధిలోని పలు విభాగాల అధికారులు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కొండాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ హమీద్ పటేల్ పాల్గొని, మస్తాన్ నగర్ కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్బంగా అధికారులను కోరారు. సమావేశంలో ఎమ్మెల్యే శ్రీ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి కాలనీలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం లేకుండా, నిర్ణీత గడువులో పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్బంగా స్థానిక ప్రజల నుంచి సమస్యలను స్వయంగా తెలుసుకుని, అభివృద్ధి పనులపై అవసరమైన చర్యలు చేపట్టేందుకు హామీ ఇచ్చారు. ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమై వారి సమస్యలకు వేగవంతమైన పరిష్కారాన్ని అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన “వన్ డే – వన్ వార్డ్” కార్యక్రమం ప్రజల నుంచి విశేష ఆదరణ పొందిందని మాజీ కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు. ఈ కార్యక్రమం సీనియర్ నాయకులు ఎర్రగుండ్ల శ్రీనివాస్ యాదవ్, మల్లెల శ్రావణ్ యాదవ్, మల్లెల రాజు యాదవ్, దామోదర్, గోపి కృష్ణ, జాన్, సొలొమాన్, సాయి యాదవ్,హరి కృష్ణ, గంగారాం యాదవ్, బాలరాజు, మహిపాల్, లక్ష్మణ్, బురాన్ రెడ్డి, అశోక్ రెడ్డి, ఆంజనేయులు, శేఖర్, వెంకటమ్మ, లక్ష్మమ్మ, అంజమ్మ, వాసు, రవి, రామస్వామి, ఏడుకొండలు, రామారావు, అక్షయ్, పూలెందర్, లక్ష్మా రెడ్డి, చెన్నమ్మ, ఈశ్వరమ్మ, లావణ్య, వైష్ణవి, టీ. భాస్కర్, ప్రకాష్, టీ. మణి, యేసు, శ్రావణ్, కాలనీవాసులు పాల్గొన్నారు.
