తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్:  రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని ఉమ్మడి మైలార్దేవ్‌పల్లి డివిజన్‌లో ఆగస్టు 2న జరగనున్న ఆషాడ మాస బోనాల మహోత్సవాలకు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి. సబితా ఇంద్రారెడ్డి, రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్‌చార్జ్ పట్లోళ్ల కార్తీక్ రెడ్డిని బోనాల ఉత్సవ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. కాటేదాన్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎస్. వెంకటేష్‌తో పాటు పార్టీ సీనియర్ నాయకులు శ్రీనగర్ కాలనీలోని వారి నివాసంలో ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి, కార్తీక్ రెడ్డి ఆహ్వానాన్ని సాదరంగా స్వీకరిస్తూ, బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన గొప్ప ఆధ్యాత్మిక ఉత్సవమని పేర్కొన్నారు. అమ్మవారి కృపాకటాక్షాలతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయు రారోగ్యాలు, సుఖశాంతులు, ఐశ్వర్యాలతో విలసిల్లాలని ఆకాంక్షిస్తూ, బోనాల మహోత్సవాలకు తప్పకుండా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆక్యం రాఘవేంద్ర యాదవ్, మైసిరెడ్డి క్రాంతి, మహేందర్, శాంతిరాజ్, అఖిల్, నిఖిల్, నితిన్, చిరు, పవన్, అనిల్, చిన్న, కున్సి సోను తదితరులు, యువకులు పాల్గొన్నారు.