తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రగతి ఎన్క్లేవ్, వీడియా కాలనీ ప్రాంతాల్లో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని యలమంచి ఉదయ్ కిరణ్ సమీక్షించారు. ఉమ్మడి మియాపూర్ పరిధిలో నిర్వహిస్తున్న తెలంగాణ ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా వివిధ బూత్ లెవల్ అధికారుల వద్దకు వెళ్లి ఓటర్ల నమోదు, వివరాల సవరణ ప్రక్రియను పరిశీలించారు. అలాగే కార్యక్రమం పురోగతిని సమీక్షిస్తూ, నమోదు ప్రక్రియ సజావుగా జరిగేలా అవసరమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఓటరు తమ పేరు ఓటర్ల జాబితాలో సక్రమంగా నమోదైందో లేదో తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని, అవసరమైతే వివరాలను సరిచేసుకోవాలని, అలాగే అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటర్ల జాబితాలో నమోదు అయ్యేలా సహకరించాలని కోరారు. సర్ నమోదు మరియు ధృవీకరణకు చివరి తేదీ3 ఆగస్టు2026 అని పేర్కొంటూ, ప్రతి ఓటరు ఆగస్టు3లోపు ఎన్యుమరేషన్ ఫార్మ్‌ను తప్పనిసరిగా సమర్పించి, తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఎల్ఓ. లు, బీ ఎల్ ఏ. లు, రత్నాచారి , సతీష్, రామ్, స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, వాలంటీర్లు పాల్గొని సర్ కార్యక్రమం విజయవంతం కావడానికి తమ సహకారాన్ని అందించారు.