తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, తారానగర్ లోని గోపినాధ్ ఫంక్షన్ హాల్ లో శ్రీమతి ముత్యాల లక్ష్మి రమేష్ ల చిన్న కూతురు పగడాల ఉదయ వందన జయసాయి ల ప్రధమ పుత్రుడు చిరంజీవి పగడాల ఆద్విక్ నందన్ కు 30వ తేదీ గురువారం బారసాల మరియు నామకరణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగ కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ వేడుకలలో పాపిరెడ్డి నగర్ అధ్యక్షులు బద్దం కొండల్ రెడ్డి, వార్డ్ మెంబర్ పొడుగు రాంబాబు, లింగారెడ్డి, ఎస్ పీ రెడ్డి, రమణయ్య హాజరై చిరంజీవి పగడాల ఆద్విక్ నందన్ ను ఆత్మీయతగా ఆశీర్వదించారు. అనంతరం, ముత్యాల లక్ష్మి రమేష్ లు మాట్లాడుతు, బారసాల మరియు నామకరణ మహోత్సవ వేడుకలకు విచ్చేసి చిరంజీవి పగడాల ఆద్విక్ నందన్ కు శుభాశీర్వచనాలు అందించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు.