తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గ్, చందానగర్ డివిజన్ పరిధిలో నిర్వహిస్తున్న తెలంగాణ ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా వివిధ బూత్ లెవల్ అధికారుల వద్దకు వెళ్లి ఓటర్ల నమోదు, వివరాల సవరణ ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ నాయకులు మిరియాల ప్రీతమ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటర్లకు అవసరమైన సూచనలు చేస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటరు వివరాలను సరిచూసుకుని అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకోవాలని ఆయన కోరారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని, ప్రతి అర్హ పౌరుడు తన ఓటు హక్కును పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో ఓటర్ల జాబితాను మరింత ఖచ్చితంగా రూపొందించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని ఈ ప్రక్రియలో అతి తక్కువ గడువు ఉన్నందువలన ప్రజలు చురుకుగా పాల్గొని తమ వివరాలను ధృవీకరించుకోవడం ఎంతో ముఖ్యమని మిరియాల ప్రీతమ్ పేర్కొన్నారు.