తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కాటేదాన్ డివిజన్ పరిధిలోని మార్కండేయ నగర్ నవయువ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు, కాంగ్రెస్ నాయకుడు కోట పవన్ కుమార్ జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే టీ. ప్రకాశ్ గౌడ్ నివాసంలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తల సమక్షంలో పవన్ కుమార్ కేక్ కట్ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే టీ. ప్రకాశ్ గౌడ్ ఆయనకు పొన్నాడ కప్పి, పుష్పగుచ్ఛం అందించి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ఎన్. ధనంజయ, టీ. ప్రేమ్ గౌడ్, యంజాల మహేష్, రాజ్ అనిల్, కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాళ్లు, మార్కండేయ నగర్ నవయువ యూత్ అసోసియేషన్ సభ్యులు మరియు స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని పవన్ కుమార్‌కు శుభాకాంక్షలు తెలియ జేశారు.
