తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, చందానగర్ జీఎస్ఎమ్ మాల్ లోని మధుర బాంకెట్ హాల్ లో శేరిలింగంపల్లి మండలం ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నాయకుల, రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ నాయకుల, 600మంది సభ్యుల సమక్షంలో కన్నుల పండుగా నిర్వహించిన సందర్బంగ శేరిలింగంపల్లి మండలం ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షులుగా మాశెట్టి ప్రభాకర్ గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. శేరిలింగంపల్లి మండలం ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన మాశెట్టి ప్రభాకర్ గుప్తా ను సభ్యులందరు అభినందిస్తూ శాలువాలతో సత్కరించి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగ మాశెట్టి ప్రభాకర్ గుప్తా మాట్లాడుతు, ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి విచ్చేసి, శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.
