తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్, స్టాలిన్ నగర్, డీకే ఎన్‌క్లేవ్, సాయిరామ్ నగర్ కాలనీ ప్రాంతాల్లో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని యలమంచి ఉదయ్ కిరణ్ విస్తృతంగా పరిశీలించారు. తెలంగాణ ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా వివిధ బూత్ లెవల్ అధికారులు నిర్వహిస్తున్న ఓటర్ల నమోదు, వివరాల ధృవీకరణ, సవరణ ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించి, కార్యక్రమం పురోగతిని సమీక్షించారు. నమోదు ప్రక్రియ వేగవంతంగా, పారదర్శకంగా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగేందుకు అవసరమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఓటరు తమ పేరు ఓటర్ల జాబితాలో సక్రమంగా నమోదైందో లేదో తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని, అవసరమైతే వెంటనే సవరణలు చేయించుకోవాలని సూచించారు. అలాగే అర్హత కలిగిన ప్రతి పౌరుడి పేరు ఓటర్ల జాబితాలో నమోదు అయ్యేలా కుటుంబ సభ్యులు, యువత, స్థానిక ప్రజలు చొరవ చూపాలని కోరారు. సర్ నమోదు మరియు ధృవీకరణకు ఆగస్టు3, 2026చివరి తేదీ అని గుర్తుచేస్తూ, ప్రతి అర్హ ఓటరు ఆగస్టు3లోపు ఎన్యుమరేషన్ ఫార్మ్‌ను తప్పనిసరిగా సమర్పించి, తన ప్రజాస్వామ్య హక్కును పరిరక్షించుకోవాలని యలమంచి ఉదయ్ కిరణ్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీ ఎల్ ఓ, బీఎల్ ఏ, లు, రత్నాచారి, సతీష్, రామ్, స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, వాలంటీర్లు పాల్గొని సర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తమ సహకారాన్ని అందించారు.