తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: ఆయుర్వేద న్యూరో, వెన్ను మరియు కీళ్ల వ్యాధుల చికిత్సలో విశేష సేవలందించిన స్వస్తిక్ ఆయుర్వేద వ్యవస్థాపకులు డాక్టర్ కృష్ణమోహన్ మద్దెల ప్రతిష్టాత్మక ఆయుర్వేద న్యూరో రత్న 2026 పురస్కారానికి ఎంపికయ్యారు. గురుపూర్ణిమ సందర్భంగా రాజస్థాన్‌లోని కోటాలో ఉన్న ఆయుర్వేద న్యూరో హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో ఆసుపత్రి దిగ్గజాలు డాక్టర్ మనోజ్ శర్మ, డాక్టర్ వేణు శర్మల చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. శస్త్రచికిత్సలు లేకుండా ప్రాచీన ఆయుర్వేద పద్ధతులతో వేలాది మందికి ఉపశమనం కలిగించినందుకు గాను ఆయనకు ఈ గౌరవం దక్కింది. కాగా, దక్షిణ భారతదేశం నుంచి ఈ పురస్కారాన్ని అందుకున్న ఏకైక వైద్యుడు డాక్టర్ కృష్ణమోహన్ కావడం విశేషం. ఈ సందర్భంగా ఆయనకు పలువురు వైద్య ప్రముఖులు అభినందనలు తెలిపారు