తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం,
లింగంపల్లిలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు సుమన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు మారబోయిన రవి యాదవ్ కేక్ కట్ చేసి సుమన్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సుమన్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, విజయాలతో నిండి దీర్ఘాయుష్షుతో జీవించాలని, ప్రజాసేవలో, పార్టీ బలోపేతంలో మరింత చురుకుగా సేవలందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని సుమన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.