తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: హైదరాబాద్‌లోని ప్రతిష్ఠాత్మకమైన గీతం విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఎంబీఏ కాన్వొకేషన్, అచీవర్స్ డే కార్యక్రమంలో గోన జైదీప్ రావు తన ఎంబీఏ మాస్టర్స్ డిగ్రీని ఘనంగా అందుకున్నారు. ఇదే సందర్భంగా ప్రముఖ బహుళజాతి సంస్థ ఎమ్ ఎన్ సీలో క్యాంపస్ ప్లేస్‌మెంట్ కూడా సాధించి తన ప్రతిభను చాటుకున్నారు. ఈనేపద్యంలో ఉన్నత వేతనంతో కూడిన ఉద్యోగాన్ని మాత్రమే జీవిత లక్ష్యంగా భావించకుండా, విద్య ద్వారానే సమాజంలో శాశ్వతమైన మార్పు తీసుకురావచ్చనే దృఢ సంకల్పంతో గోన జైదీప్ రావు వ్యాపారవేత్తగా విద్యారంగాన్ని ఎంచుకున్నారు. ప్రస్తుతం చందానగర్ ఇంజీనియం ఇంటర్నేషనల్ స్కూల్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న గోన జైదీప్ రావు, నేటి కాలంలో చాలామంది యువత ఉద్యోగాలు లేదా అధిక ఆదాయం వచ్చే వ్యాపారాల వైపు అడుగులు వేస్తున్న సమయంలో, సమాజ నిర్మాణానికి పునాది అయిన విద్యారంగాన్ని తన సేవా మార్గంగా ఎంచుకోవడం ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. నేటి చిన్నారులే రేపటి నాయకులనే నమ్మకంతో, చిన్న వయస్సు నుంచే పిల్లలకు నాణ్యమైన విద్య, హోలిస్టిక్ లెర్నింగ్, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, నైతిక విలువలు, సృజనాత్మక ఆలోచన, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, జీవన నైపుణ్యాలను పెంపొందించే విద్యను అందించడమే తన ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ఇంజీనియం ఇంటర్నేషనల్ స్కూల్‌ను విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారు. విద్య అనేది కేవలం ఉద్యోగం పొందడానికి లేదా డబ్బు సంపాదించడానికి మాత్రమే కాదని, భావితరాలను తీర్చిదిద్దే అత్యంత శక్తివంతమైన సాధనమని ఆయన విశ్వసిస్తున్నారు. ప్రతి చిన్నారి వ్యక్తిత్వ వికాసమే దేశ అభివృద్ధికి బలమైన పునాది అని పేర్కొంటూ, ప్రపంచ స్థాయి విద్యను స్థానిక స్థాయిలో అందించి బాధ్యతగల పౌరులను, సమర్థ నాయకులను తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. విద్యారంగంతో పాటు వివిధ రంగాల్లో కొత్త వ్యాపార అవకాశాలను అన్వేషిస్తూ యువ పారిశ్రామికవేత్తగా తన ప్రత్యేక గుర్తింపును మరింత బలోపేతం చేసుకుంటున్నారు. యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా, ఉపాధి అవకాశాలను సృష్టించే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆయన ప్రోత్సహిస్తున్నారు. ఈ సందర్భంగా గోన జైదీప్ రావు మాట్లాడుతూ, డిగ్రీ అనేది కేవలం ఉద్యోగం కోసం కాదని సమాజానికి విలువైన సేవ చేయడానికి, కొత్త అవకాశాలను సృష్టించడానికి, భావితరాలను తీర్చిదిద్దడానికి ఉపయోగపడాలని విద్య ద్వారా ఒక్క చిన్నారి జీవితంలో వచ్చే మార్పు, భవిష్యత్తులో దేశ అభివృద్ధికి బలమైన పునాదిగా నిలుస్తుందని అన్నారు. నిజమైన నాయకుడు అంటే కేవలం ఒక సంస్థను నడిపించేవాడు కాదని భావితరాలను తీర్చిదిద్దేవాడనే ఆలోచనతో విద్యారంగంలో సేవలందిస్తున్న గోన జైదీప్ రావు, నాణ్యమైన విద్య ద్వారా సమాజానికి ఉత్తమ పౌరులను అందించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. గీతం విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ పట్టా అందుకుని, అచీవర్స్ డే కార్యక్రమంలో పాల్గొని, విద్యారంగంలో తనదైన ముద్ర వేస్తున్న గోన జైదీప్ రావు ప్రయాణం నేటి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందన్నారు.