తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి కార్పోరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సతీమణి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు మాజీ చైర్‌పర్సన్, ప్రముఖ సామాజిక సేవకురాలు శ్రీమతి రాగం సుజాత యాదవ్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన విషయం తెలుసుకున్న పాపిరెడ్డి కాలనిలోని మహిళా సంఘ సేవకురాలైన కే. కనకలక్ష్మి తీవ్ర దిగ్భ్రాంతికి లోనై , విచారం వ్యక్తంచేస్తూ, నల్లగండ్లలోని వర్టెక్స్ కింగ్‌స్టన్ లోని శ్రీమతి రాగం సుజాత యాదవ్ స్వగృహంలో సందర్శకుల దర్శనార్థం ఉంచిన పార్థివదేహాన్ని కడసారి చూసుకొంటూ కన్నీటి పర్యంతమవుతూ శ్రీమతి రాగం సుజాత యాదవ్ మహిళలకు చేసిన సేవలను, గత స్మృతులను తలచుకుంటూ ఇకపై మాకు మీ అండ లేదనే విషయాన్ని తట్టుకోలేక పోతున్నామంటూ బరవెక్కిన విచార హృదయంతో ఆవేదన వ్యక్తంచేస్తూ,ఆమె మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ, వారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని రాగం సుజాత యాదవ్ కు అశ్రునివాళర్పిస్తూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని చేతులెత్తి భగవంతుని ప్రార్థించారు.
