తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: “రక్తదానం చేయడం ద్వారా మనం ఎవరో ఒకరి జీవితంలో వెలుగు నింపగలం. మనం చేసే చిన్న సహాయం ఒక అమూల్యమైన ప్రాణాన్ని కాపాడగలదు” అని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ అన్నారు. అమీన్‌పూర్‌లో మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవం సందర్భంగా, సత్య స్పోర్ట్స్ అధినేత మరియు చిరంజీవి అభిమాని సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని వి. జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యలమంచి ఉదయ్ కిరణ్ పాల్గొని రక్తదాతలను అభినందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రక్తదానం ఒక చిన్న ప్రయత్నంలా కనిపించినప్పటికీ, అత్యవసర సమయంలో ఒక నిండు ప్రాణాన్ని కాపాడే మహోన్నత సేవ అని పేర్కొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ రక్తదానంపై అవగాహన పెంచుకుని, అవసరమైన వారికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రవీందర్ రెడ్డి , అశోక్ , మూర్తి , ముజీబ్ , రాధాకృష్ణ , వంశీ ,ప్రవీణ్ , రత్నాచారి, నాగసాయి , శశి , మధు తదితర నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.