తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్పర్సన్, ప్రముఖ సామాజిక సేవకురాలు కీ.శే.రాగం సుజాత యాదవ్ స్వర్గస్తులయ్యారని తెలిసి ఏఐసిసి సీడబ్ల్యుసి సభ్యులు, మాజీ పీసీసీ అధ్యక్షులు రఘువీర రెడ్డి నల్లగండ్లలోని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ స్వగృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రఘువీర రెడ్డి రాగం నాగేందర్ యాదవ్ ని కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రాగం సుజాత యాదవ్ గారి సేవలు చిరస్మరణీయం. రాగం సుజాత యాదవ్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, మహిళా సాధికారతకు చేసిన సేవలు మరువలేనివని రఘువీర రెడ్డి కొనియాడారు. వారి మృతి సామాజిక రంగానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు