తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: గాంధీభవన్లో పీఏసీ. సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ తో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వజ్రెష్ యాదవ్ , కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ సమావేశమయ్యారు. మీనాక్షి నటరాజ్ తో గత 45రోజులు పైగా జరిగినటువంటి మొదటి దశ ఎస్ఐఆర్ కార్యక్రమంపై చర్చించారు. ఈ సందర్భంగా రమేష్ “సర్” కార్యక్రమంలో బిఎల్ఎలు, డివిజన్ అధ్యక్షులు బ్లాక్ ప్రెసిడెంట్ లు చాలా చక్కగా పనిచేశారని, ఇంటింటికి వెళ్లి ప్రతి ఓటరు కలిసే అవకాశం దక్కిందని మీనాక్షి నటరాజన్ కు వివరించారు. ఈ సమావేశంలో మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ, గత పీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, నిర్దేశించిన కార్యాచరణ పురోభివృద్ధిపై చర్చించారు, అలాగే డివిజన్ కమిటీల నియామకం, స్థానిక రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ పనితీరుపై ప్రజల అభిప్రాయాలను మీనాక్షి నటరాజన్ అడిగి తెలుసుకున్నారు. “సర్” తొలిదశ ముగిసిందని, త్వరలో ప్రారంభం కానున్న “సర్2” కార్యక్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచిస్తూనే, ఈ కార్యక్రమం కూడా “సర్ 1” లాగానే దృఢ సంకల్పంతో విజయవంతం చేయాలని కోరారు.
