తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, చందానగర్‌లోని శ్రీశ్రీ శారదాపీఠ పాలిత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన “శ్రీశక్తి సనాతన శక్తి” కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ గౌరవనీయులు శివప్రసాద్ శుక్లా హాజరై శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారు, శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానంద స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి సీనియర్ కాంగ్రెస్ నాయకులు మిరియాల రాఘవరావు , మిరియాల ప్రీతమ్ కుటుంబ సమేతంగా గవర్నర్ శ్రీ శివప్రసాద్ శుక్లా ను మర్యాదపూర్వకంగా కలిసి, ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సనాతన ధర్మ పరిరక్షణకు సంబంధించిన పలు అంశాలపై ప్రముఖులు చర్చించి, తమ అభిప్రాయాలను వెల్లడించారు. సనాతన ధర్మ విలువలు, ఆధ్యాత్మికత, ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరాన్ని వక్తలు వివరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
