తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, మియాపూర్ జడ్పీహెచ్ ఎస్ స్కూల్లోని ఎస్ఏ తెలుగు ఉపాధ్యాయులు శ్రీమతి యం.విజయ బుగ్గన్న పదవీ విరమణ సందర్బంగ 4వ తేదీ ఆదివారం మియాపూర్ లోని శుభం సెలబ్రేషన్స్ హోటల్లో నిర్వహించబోతున్న శ్రీమతి యం. విజయ బుగ్గన్న అభినందన సన్మాన కార్యక్రమానికి చందానగర్ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డిని చందానగర్ లోని వారి కార్యాలయంలో ఏఏపిసి చైర్మన్, ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి గౌరవప్రదంగా ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్బంగ మంజుల రఘునాథ్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ తప్పకుండా సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.
