తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, కొండాపూర్ మసీదు బండ గ్రామంలోని శ్రీ స్వయంభు వీరాంజనేయ స్వామి దేవాలయం ధర్మకర్త మారబోయిన సందీప్ యాదవ్ ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధిని ప్రత్యేక శ్రద్ధతో అంకిత భావంతో ఆ వీరాంజనేయ స్వామిపై అత్యంత భక్తి భావంతో భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాటుచేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా విజయదశమి పర్వదినం రోజున భక్తులకు అందుబాటులో ఉండాలనే సదుద్దేశంతో దేవాలయ ఆవరణలో జమ్మిచెట్టు ఏర్పాటుచేసిన నేపథ్యంలో రాబోయే విజయదశమిని దృష్టిలో ఉంచుకొని జమ్మిచెట్టు యొక్క ప్రాముఖ్యతపై దేవాలయ ధర్మకర్త మారబోయిన సందీప్ యాదవ్ మాట్లాడుతూ, విజయదశమి రోజున భక్తులకు అందుబాటులో జమ్మిచెట్టు ఉండాలనే సదుద్దేశంతో శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయ ఆవరణలో ఏర్పాటుచేసామని, జమ్మి చెట్టును సంస్కృతంలో శమీ వృక్షం అని పిలుస్తారని, విజయదశమి నాడు జమ్మిచెట్టు పూజ చేయడం మన సంప్రదాయమని, పాండవులు వనవాసం అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ దివ్య ఆయుధాలను జమ్మి చెట్టుపై దాచి భద్రపరిచారని, తిరిగి వచ్చి విజయదశమి రోజున ఆ ఆయుధాలను తీసుకుని పూజించారని, అప్పటి నుంచి విజయం చేకూర్చే చెట్టుగా దీనిని పూజిస్తున్నారని, దసరా రోజున జమ్మి చెట్టును పూజించి, బంధుమిత్రులకు జమ్మి ఆకులను ఇచ్చి బంగారంగా భావించి శుభాకాంక్షలు చెప్పుకోవడం ఆచారమని, ఇది ఐశ్వర్యాన్ని, విజయాన్ని చేకూరుస్తుందని నమ్ముతారని, దసరా రోజున తెలంగాణ ప్రజలు తొలుత పాలపిట్టను చూస్తారని అనంతరం, జమ్మి చెట్టును పూజించడం లక్ష్మీ ప్రదమని పురాణాలు చెబుతున్నాయని అలానే జమ్మి చెట్టు ఆకులను ఇంట్లోని పూజాస్థలంలో, నగదు పెట్టెల్లో ఉంచుకోవటం వల్ల ధనవృద్ది జరుగుతుందని విశ్వాసమని అంతే కాకుండా జమ్మిచెట్టుకు పురాణాల్లో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉందని అదేంటంటే, క్షీరసాగర మధనంలో కల్పవృక్షంతో పాటు మరికొన్ని దేవతా వృక్షాలు కూడా పుట్టాయని వాటిల్లో జమ్మిచెట్టు కూడా ఒకటని దీన్ని సంస్కృతంలో శమీ వృక్షంగా పిలుస్తారని అలాగే, విజయదశమి నాడు జమ్మిచెట్టుని దేవీ ప్రతిరూపంగా కొలిచి పూజిస్తారని జమ్మి ఆకుని బంగారంగా పంచుకుంటారని పెద్దవాళ్ల ఆశ్వీరాదాలు తీసుకుంటారని అలయ్ బలయ్ పేరుతో ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు చెప్పుకుంటారని తెలిపారు.
