తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్ర నగర్ డివిజన్ పరిధిలోని ఎర్రబోడలో మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి సప్న రెడ్డి అధ్యక్షతన విశేష కార్యక్రమం జరిగింది. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మహిళలు, గర్భిణీ స్త్రీల ఆరోగ్యం మరియు పోషకాహార భద్రత కోసం మిషన్ శక్తి/పోషణ్ అభియాన్ ద్వారా అనేక పథకాలను అందిస్తోందని ఈ సందర్భంగా నాయకులు తెలియజేశారు. గర్భిణులకు మెరుగైన పోషక విలువలు అందించడంలో, క్షేత్రస్థాయిలో విశేష సేవలు అందిస్తున్న అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు మరియు ఆశా వర్కర్లను గుర్తించి వారికి ఈ వేదికపై ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజేంద్ర నగర్ డివిజన్ అధ్యక్షుడు పసుపుల సందీప్ ముదిరాజ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా నాయకురాలు వనితా రెడ్డి, పవన్ కుమార్, మల్లేష్ చారి, ఎల్. వెంకటేష్, షేక్ బాషా, బాల సాయిలతో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
