తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: చిన్నకోడూరు, ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడమే నిజమైన మానవత్వమని నమ్ముతూ ప్రముఖ సామాజిక వేత్త వంగ రాజేశ్వర్ రెడ్డి (VRR) మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కిష్టాపూర్ గ్రామంలో ఇటీవల గుండెపోటుతో మరణించిన కీ.శే. కల్లూరి దేవయ్య కుటుంబాన్ని VRR టీం సభ్యులు గురువారం పరామర్శించారు.వంగ రాజేశ్వర్ రెడ్డి తరఫున బాధిత కుటుంబానికి 50 కిలోల బియ్యాన్ని అందజేసి, వారికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో అల్లిపూర్ గ్రామ సర్పంచ్ కుంబాల చంద్రశేఖర్, VRR టీమ్ సభ్యులు కుందే తిరుపతి (బీరయ్య), పడిగే లింగం, గ్రామస్తులు కమలాకర్, నవీన్, మల్లయ్య, దేవయ్య తదితరులు పాల్గొన్నారు. నిరుపేద, ఆపదలో ఉన్న కుటుంబాలకు వంగ రాజేశ్వర్ రెడ్డి తరఫున ఇలాంటి సహాయ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని ఈ సందర్భంగా VRR టీం సభ్యులు స్పష్టం చేశారు.