తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : అసంఘటిత రంగ కార్మికుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతామని ఐఎల్‌డబ్ల్యూఎఫ్ రాజేంద్రనగర్ నియోజకవర్గ నూతన కార్యవర్గం ప్రకటించింది. బుధవారం నిర్వహించిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.చైర్మన్‌గా మీర్ ఇనాయత్ అలీ బాబ్రీ, అధ్యక్షుడిగా సి. అమర్, ఉపాధ్యక్షుడిగా ఉష్కమూరి విజయ్‌కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎస్. భాస్కర్, ప్రధాన కార్యదర్శిగా ఎస్. సామి, కోశాధికారిగా ఎస్. మైపాల్, సంయుక్త కార్యదర్శిగా సి. శివ ఎన్నికయ్యారు.తెలంగాణలో అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు, డ్రైవర్లు, లారీ కార్మికులకు కనీస వేతనంతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్, బీమా వంటి సామాజిక భద్రతా సౌకర్యాలు కల్పించాలని నూతన కార్యవర్గం డిమాండ్ చేసింది. రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందే లేదా తీవ్రంగా నష్టపోయే డ్రైవర్లకు రూ.50 లక్షల బీమా, డ్రైవర్లు, వారి కుటుంబాలకు ఆరోగ్య రక్షణ కార్డులు అందించాలని కోరింది.అదేవిధంగా డ్రైవర్ సహజ మరణం సంభవించినప్పుడు కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సాయం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కార్మికుల సంక్షేమానికి సంబంధిం చిన ఈ ప్రధాన డిమాండ్ల సాధన కోసం ఐఎల్‌ డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని నూతన కార్యవర్గం వెల్లడించింది.