తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, మాదాపూర్ సర్కిల్ 21పాత సర్కిల్50 హుడా మయూరి నగర్ ఫేజ్1లోని డా. అబ్దుల్ కలాం పార్క్ నిర్వహణలో జీహెచ్ఎంసీ అధికారుల తీవ్ర నిర్లక్ష్యంతో పిల్లల ఆట వస్తువులన్ని పాడైపోయాయని, పార్క్ పరిస్థితి దయనీయంగా మారిందని దీనిపై మున్సిపల్ కార్పొరేషన్ చూపుతున్న తీవ్ర అసమర్థతను సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దృష్టికి తీసుకురావడానికి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మన్నెపల్లి సాంబశివరావు వ్రాత పూర్వకంగా ఫిర్యాదు చేసారు. ఈ సందర్బంగ మన్నెపల్లి సాంబశివరావు మాట్లాడుతు, డా. అబ్దుల్ కలాం పార్క్ దయనీయ స్థితిని, దీనిపై మున్సిపల్ కార్పొరేషన్ చూపుతున్న తీవ్ర అసమర్థతను సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దృష్టికి తీసుకురావడం జరిగిందని, ప్రజల నుండి క్రమం తప్పకుండా పన్నులు వసూలు చేస్తున్నప్పటికీ, పార్కు నిర్వహణలో జీహెచ్ఎంసీ ఘోరంగా విఫలమైందని, గత కొన్ని నెలలుగా కనీస పర్యవేక్షణ లేకపోవడం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని, ప్రస్తుతం పార్కంతా పెద్దపెద్ద గడ్డి, పిచ్చిమొక్కలు, ముళ్ల పొదలతో నిండిపోయి అడవిలా తయారైందని, దీనివలన దోమలు, పాములు, వీధి కుక్కల సంచారం విపరీతంగా పెరిగిపోయిందని, చుట్టుపక్కల నివసించే కాలనీవాసుల ఆరోగ్యానికి, ప్రాణాలకు తీవ్ర ముప్పుగా పరిణమించిందని దీనికి తోడు పార్కులో పిల్లలు ఆడుకునే ఊయలలు, జారుడు బల్లలు పూర్తిగా విరిగిపోయి, తుప్పు పట్టిపోయాయి. కార్పొరేషన్ నిర్లక్ష్యంతో విరిగిన వస్తువులు పిల్లల ప్రాణాలకు ప్రమాదకరంగా మారాయని ప్రజా ధనాన్ని వృథా చేస్తూ, కనీస పౌర సౌకర్యాలను కూడా గాలికొదిలేసిన సిబ్బంది పనితీరు అత్యంత విచారకరమని, ఇప్పటికైనా పార్కులో పెరిగిన పిచ్చి మొక్కలు, పొదలు, పేరుకుపోయిన చెత్తను సిబ్బందితో శుభ్రం చేయించాలని, విరిగిపోయిన పిల్లల ఆట వస్తువులను రిపేరు చేయించడం లేదా కొత్తవి ఏర్పాటుచేయాలని, పార్క్ ను క్రమం తప్పకుండా శుభ్రం చేసేలా సిబ్బందిని వెంటనే పురమాయించాలన్నారు.ఈ పనులన్నింటి త్వరితగతిన పూర్తిచేయవలసిందిగా కోరతున్నామని, పౌరుల పట్ల బాధ్యతగా వ్యవహరించి, కాలనీ పిల్లలు, పెద్దలు పార్కును మళ్లీ సురక్షితంగా ఉపయోగించుకునేలా తగిన చర్యలు వెంటనే తీసుకుంటారని ఆశిస్తున్నామన్నారు.
