తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :  ఆగస్టు 23, 2026న పయనీర్ కాన్సెప్ట్ స్కూల్ జరగనున్న శతాబ్ది యువ సమ్మేళనం సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. యువతలో దేశభక్తి, జాతీయ భావన, సేవా స్ఫూర్తిని పెంపొందించడమే శతాబ్ది యువ సమ్మేళనం ప్రధాన లక్ష్యమని తెలిపారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, యువశక్తి దేశ నిర్మాణానికి అఖండ శక్తి అని పేర్కొన్నారు. యువత సామాజిక బాధ్యతతో ముందుకు సాగుతూ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు. ఆగస్టు 23న జరగనున్న శతాబ్ది యువ సమ్మేళనాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కోరారు.