తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: తెలంగాణ గడ్డపై అణగారిన వర్గాల ఆత్మగౌరవం, సమానత్వం, న్యాయం మరియు ప్రజా హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన వీర తెలంగాణ యోధుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను మియాపూర్ డివిజన్ పరిధిలోని ఆల్విన్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ పాల్గొని, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మియాపూర్ నాయకులు యలమంచి ఉదయ్ కిరణ్ కూడా కార్యక్రమంలో పాల్గొని మహనీయునికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వి. జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ, “సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం ధైర్యానికి ప్రతీక. ఆయన పోరాటం సమానత్వానికి స్ఫూర్తి. ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం నిలబడే ప్రతి ఒక్కరికీ ఆయన జీవితం మార్గదర్శకం” అని అన్నారు. సామాన్య కుటుంబం నుంచి ఎదిగి, అన్యాయాన్ని ఎదురించి, ప్రజల హక్కులు , స్వాభిమానం కోసం పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్ర తెలంగాణ సమాజానికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని నాయకులు పేర్కొన్నారు. పదవి కోసం కాదు ప్రజల కోసం పోరాటం అధికారం కోసం కాదు సమానత్వం కోసం ఉద్యమం స్వార్థం కోసం కాదు సమాజం కోసం సేవ ఇదే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం మనకు అందించే గొప్ప సందేశమని వారు అన్నారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం, సమానత్వం , అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, శేరిలింగంపల్లి నియోజకవర్గం గౌడ్ సంఘం అధ్యక్షులు లక్ష్మీనారాయణ గౌడ్, టీపీసీసీ రాష్ట్ర లేబర్ సెల్ ఉపాధ్యక్షులు నల్ల సంజీవ రెడ్డి, బల్లింగ్ యాదగిరి గౌడ్, రమణ మూర్తి, సయ్యద్ గౌస్, వీరేందర్ గౌడ్, ఓం ప్రకాష్ గౌడ్, సత్యం గౌడ్, కనకమామిడి నరేందర్ గౌడ్, యాదగిరి గౌడ్, మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, బాలింగ్ గౌతమ్ గౌడ్, కరుణాకర్ గౌడ్, మన్నేపల్లి సాంబశివరావు, కావూరి ప్రసాద్, రవీందర్ రెడ్డి, శేఖర్ ముదిరాజ్, పుట్ట వినయ్ కుమార్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, కృష్ణ గౌడ్, బాబు గౌడ్, సాయి కృష్ణ గౌడ్, ఏకాంత్ గౌడ్, శ్రీ వెంకటేష్ గౌడ్, ఎంఎస్ రాజు, నాగేశ్వరరావు, బాలకృష్ణ, గంగాల గణేష్ యాదవ్, తాండ్ర రామచందర్, రాములు గౌడ్, నర్సింహ గౌడ్, రాము, ఆనంద్ గౌడ్, సత్యనారాయణ, శేరిలింగంపల్లి నియోజకవర్గం సేవాదళ్ అధ్యక్షులు నర్సింగ్ రావు, ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు లక్ష్మణ్ గుప్తా, శంకర్ గౌడ్, కృష్ణ, వెంకటేష్ గౌడ్, లక్ష్మీనారాయణ, సత్య రెడ్డి, శంకర్, సుధాకర్, భాస్కర్ గౌడ్, వెంకటేష్, తిరుపతి, ముక్తార్, సాజిద్, విష్ణు, సత్యనారాయణ, శ్రీనివాస్ గుప్తా, శ్రీ రవి కుమార్ గౌడ్, మహిళా కాంగ్రెస్ డీసీసీ కార్యదర్శి శ్రీమతి శిరీష సత్తూరు, బ్లాక్ అధ్యక్షురాలు శ్రీమతి భాగ్యలక్ష్మి, శ్రీమతి కల్పన ఏకాంత్ గౌడ్, శ్రీమతి అనిత, శ్రీమతి శేషిరేఖ, శ్రీమతి శ్రీజ రెడ్డి, ఉపాధ్యక్షులు శ్రీమతి జయ, శ్రీమతి పార్వతి, శ్రీమతి నాజియా తదితరులు పాల్గొని వీర తెలంగాణ యోధుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు.
