తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, మదినగూడ డివిజన్ పరిధిలో ప్రమాదవశాత్తు బిల్డింగ్‌పై నుంచి జారిపడి గాయపడిన దినేష్ అనే వ్యక్తి ప్రస్తుతం ఈఎస్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మిరియాల ప్రీతమ్ ఆసుపత్రికి వెళ్లి బాధితుడిని పరామర్శించారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. చికిత్సకు ఎలాంటి అండదండలేని వ్యక్తికి అండగా నిలుస్తూ రూ.20,000.ఆర్థిక సహాయం అందించారు. ఆపదలో ఉన్న తన కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటాడని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సాయి, మనోజ్,అంజి, త్రిలోచన్, జమీర్ తదితరులు పాల్గొన్నారు.