తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, కొండాపూర్ విలేజ్ మసీద్ బండలోని శ్రీశ్రీశ్రీ స్వయంభూ వీరాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం శాస్త్ర యుక్తంగా పండిత శ్రేష్టులచే శ్రీ వీరాంజనేయ స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి స్వామికి ధూప ధీప నైవేద్యాలను సమర్పించారు. అనంతరం, శ్రీ వీరాంజనేయ స్వామి సన్నిధిలో పూజలందుకున్న నైవేద్య ప్రసాదాలను శ్రీ వీరాంజనేయ దర్శనార్దమై విచ్చేసిన భక్త జనులందరికీ అందజేస్తూ సర్వేజనా సుఖినోభవంతు అంటూ పండిత శ్రేష్ఠులు ఆశీర్వదించారు. ఈ సందర్బంగ శ్రీశ్రీశ్రీ స్వయంభూ వీరాంజనేయ స్వామి దేవాలయ ధర్మకర్త మారబోయిన సందీప్ యాదవ్ భక్తజనులందరి మీద శ్రీ వీరాంజనేయ స్వామి వారి దివ్య ఆశీస్సులు ఉండాలని, అందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని శ్రీ వీరాంజనేయ స్వామిని వేడుకున్నట్లుగా తెలియజేశారు.