తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, మియాపూర్ జడ్పీహెచ్ ఎస్ స్కూల్లోని ఎస్ఏ తెలుగు ఉపాధ్యాయులు శ్రీమతి యం.విజయ బుగ్గన్న పదవీ విరమణ సందర్బంగ 4వ తేదీ ఆదివారం మియాపూర్ లోని శుభం సెలబ్రేషన్స్ హోటల్లో ఘనంగా నిర్వహించిన శ్రీమతి యం. విజయ బుగ్గన్న అభినందన సన్మాన కార్యక్రమంలో లింగంపల్లి జడ్.పి.హెచ్.ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు పద్మావతి విచ్చేసి శ్రీమతి యం. విజయ బుగ్గన్న లను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగ పద్మావతి మాట్లాడుతు, శ్రీమతి యం. విజయ బుగ్గన్న బోధించిన పాఠ్యాంశాలను విద్యార్థులు శ్రద్ధగా ఆకలింపు చేసుకుని ఉన్నత స్థాయికి ఎదిగారని వారు అంకితభావంతో ఉపాధ్యాయ వృత్తికి న్యాయం చేశారని ప్రతి ఒక్క విద్యార్థి హృదయంలో ప్రేమాభిమానాలను పదిలపరుచుకున్నారని కొనియాడారు.