తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : స్వర్గీయ పట్లోళ్ల ఇంద్రారెడ్డి గారి 72వ జయంతి వేడుకలను రాజేంద్రనగర్ సర్కిల్, డైరీ ఫారమ్ చౌరస్తాలోని ఐబీ ఫంక్షన్ హాల్ వద్ద ఘనంగా నిర్వహించారు. సర్కిల్ అధ్యక్షులు కోలన్ సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇంచార్జ్ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇంద్రారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.​ఈ కార్యక్రమంలో కాట్టేదాన్ డివిజన్ అధ్యక్షులు ఎస్. వెంకటేష్, రమేష్ ముదిరాజ్, జాలిగం చిత్తారి, పోయిల జీవన్ దాస్, మాజీ కౌన్సిలర్ కోరని దయానంద్, ఎడ్లకాడి సూర్యం, రాము యాదవ్, రఘు యాదవ్, ధర్మారెడ్డి, వీర్లపల్లి నవీన్, పచ్చ శ్రీనివాస్, ఉమారెడ్డి, వెంకటరెడ్డి, ఆనంద్ రెడ్డి, వాసు, జగదీష్, చిరంజీవి, కొత్త రాజశేఖర్ రెడ్డి, నయీమ్, జహీరుద్దీన్, మల్లికార్జున్, సునీల్, సుమన్, అనిల్, జనార్దన్, కమల్, రమేష్, గిరి, పంబాల రాజు, అరుణ రెడ్డితో పాటు వివిధ డివిజన్ల నాయకులు, ఇంద్రన్న అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.