తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం శ్రీ హేమ దుర్గా భవన్‌లో కూకట్‌పల్లి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎం.డి. సలీం ఆధ్వర్యంలో కూకట్‌పల్లి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ నిర్వహించిన సమావేశానికి టీపీసీసీ వైస్-ప్రెసిడెంట్, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే యూత్ కాంగ్రెస్ ఇంచార్జ్ భవ్య, డిస్ట్రిక్ట్ ఇంచార్జ్ మున్నీర్ అహ్మద్ & నాగార్జున, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ బొమ్మక్క అజయ్, స్టేట్ సెక్రటరీ రమ్య తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి యువతే ప్రధాన బలమని, కూకట్‌పల్లి నియోజకవర్గంలో యూత్ కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేయాలని అన్నారు. యువత ప్రజా సమస్యలపై ముందుండి పోరాడుతూ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రతి డివిజన్‌లో యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ యువతను పెద్ద సంఖ్యలో పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని బండి రమేష్ సూచించారు. ఈ సందర్భంగా కూకట్‌పల్లి నియోజకవర్గంలో యూత్ కాంగ్రెస్ కార్యకలాపాల బలోపేతం, యువతను కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడం, రాబోయే కార్యక్రమాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో కూకట్‌పల్లి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
