తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: జాతీయ జనగణనలో ఓబీసీ కులగణనను చేర్చాలని, బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శంషాబాద్ లోని షర్లపల్లిలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ, శేరిలింగంపల్లి నియోజకవర్గ అసెంబ్లీ ఇన్చార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ఓబీసీ బహిరంగ సభ మరియు ర్యాలీలో శేరిలింగంపల్లి కాంగ్రేస్ పార్టీ ఉపాధ్యక్షురాలు మల్లెల జయ పాల్గొని తమ సంఘీభావాన్ని తెలియజేస్తూ భాగస్వాములయ్యారు. ఈ సందర్బంగ మల్లెల జయ మాట్లాడుతు, బీసీలకు సామాజిక న్యాయం, విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలంటే కులగణన ఎంతో అవసరమని, ప్రతి బీసీ కుటుంబానికి న్యాయం జరిగేలా కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. బీసీల హక్కుల సాధన కోసం నిర్వహించిన భారీ సభలో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు, శేరిలింగంపల్లి నియోజకవర్గం మాజీ కార్పొరేటర్లు,సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,పెద్దలు, కంటెస్టెడ్ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు,బ్లాక్ అధ్యక్షులు, డివిజన్ ఇన్చార్జులు,మైనారిటీ సోదరులు, లేబర్ సెల్ నాయకులు, మహిళా కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షులు, సోదరీమణులు, యువ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యుఐ నాయకులు, సేవాదళ్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసారని తెలిపారు.