తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : బోధనను వృత్తిగా, రక్తదానాన్ని ప్రవృత్తిగా చేసుకుని ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్నారు ప్రభుత్వ ఉపాధ్యాయుడు షేక్ అల్లావలి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలోని ఎం.పీ.పీ.ఎస్. శ్రీరాం నగర్ పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న ఆయన విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను బోధిస్తున్నారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 2న గాంధీ జయంతి, జూన్ 14న ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా రక్తదానం చేయడం ఆయనకు అలవాటుగా మారింది. ఇందులో భాగంగా ఆదివారం మొయినాబాద్‌లోని చిరిగే ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన మీలాద్ రక్తదాన శిబిరంలో మరోసారి రక్తదానం చేశారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ చేతుల మీదుగా రక్తదాన ధ్రువీకరణ పత్రాన్ని అందు కున్నారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్న షేక్ అల్లావలిని పలువురు అభినందించారు.