తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్ : శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ బీ బ్లాకులో నూతనంగా ఏర్పాటుచేసిన ‘సూర్కి బౌల్స్’ మల్టీక్యూజిన్ రెస్టారెంటును సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కొండాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ హమీద్ పటేల్ ముఖ్యఅతిధిగా విచ్చేసి, తమ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి రెస్టారెంటును ప్రారంభించారు. ఈ సందర్భంగా హమీద్ పటేల్ మాట్లాడుతూ, స్థానిక ప్రజలకు నాణ్యమైన,రుచికరమైన ఆహారాన్ని అందించి, కస్టమర్ల అభిరుచిని, మన్ననలు పొందే విధంగా ముందుకు సాగాలని అభిలాషించారు. ఈ సందర్బంగా రెస్టారెంటు యాజమాన్యం మొహ్మద్ సుఫియాన్ ఉద్దీన్, మొహ్మద్ సైఫ్ ఉద్దీన్ లకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. వ్యాపారంలో వారు మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హమీద్ పటేల్ తో పాటు సీనియర్ నాయకులు తిరుపతి యాదవ్, యువ నాయకులు అబ్దుల్ ముక్తార్ , మహబూబ్, షేక్ రషీద్, అబ్దుల్ గఫర్, అమీనుద్దీన్, సయ్యద్ జఫర్, పలువురు స్థానిక ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు.