తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : జాతీయ టీకాల కార్యక్రమంలో భాగంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, రాజేంద్రనగర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో 10 నుంచి 16 ఏళ్ల బాలబాలికలకు టెటనస్–డిఫ్తీరియా టీకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ జి. చేతన్ ఆధ్వర్యంలో ఏఎన్‌ఎంలు అందాల్, ఇందిర, ఎస్తేర్, సబిత పాల్గొని సుమారు 300 మంది విద్యార్థులకు టీడీ టీకాలు వేశారు. టెటనస్, డిఫ్తీరియా వంటి నివారించగల వ్యాధుల నుంచి రక్షణ పొందేందుకు కౌమార దశలో టీకాలు వేయించుకోవడం ముఖ్యమని విద్యార్థులకు వివరించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల టీకాల వివరాలను నమోదు చేసుకుని, సిఫారసు చేసిన టీకాలను నిర్ణీత సమయంలో వేయించేలా చూడాలని సూచించారు.