తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : శంషాబాద్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రేష్ఠం గేట్‌వే హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. హోటల్ నిర్వాహకులు సంకూరి జై ప్రకాష్ కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై తన చేతుల మీదుగా హోటల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ, శ్రేష్ఠం గేట్‌వే హోటల్ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ మంచి పేరు సంపాదించుకోవాలని ఆకాంక్షించారు. హోటల్ నిర్వాహకులు సంకూరి జై ప్రకాష్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంకూరి జై ప్రకాష్ కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, నాయకులు, తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
