తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పలు కాలనీలలో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను వివరించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ ప్రజావాణి కార్యక్రమంలో సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ ను కలిసి వినతిపత్రం అందజేసారు. ఈ సందర్భంగా కమీషనర్ తో సమావేశం ఏర్పాటుచేసి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న రోడ్లు, వీధి దీపాలు, పార్కుల అభివృద్ధి, శ్మశానవాటిక అభివృద్ధి తదితర సమస్యలపై అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని, ప్రతి సమస్యను ప్రాధాన్యతతో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సయ్యద్ గౌడ్, మన్నేపల్లి సాంబశివ రావు, కావూరి ప్రసాద్, పట్వారీ శశిధర్, రాజేష్, కటారి వెంకట్, సయ్యద్ తహేర్ హుస్సేన్, శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు.
