తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, చెన్నై: దేశవ్యాప్తంగా ఓబీసీ కులగణన చేపట్టాలనే డిమాండ్‌కు డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. జనాభా ప్రాతిపదికన అన్ని సామాజిక వర్గాలకు సమాన హక్కులు, న్యాయం అందాలంటే కులగణన ఎంతో కీలకమని ఆయన స్పష్టం చేశారు.
ఆల్ ఇండియా ఓబీసీ కోఆర్డినేషన్ కమిటీ ప్రతినిధులు సోమవారం చెన్నైలో స్టాలిన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ బృందానికి ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ నేషనల్ సెక్రటరీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు రాకేష్ దత్త నాయకత్వం వహించారు.
ఈ నెల 28న న్యూఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో నిర్వహించనున్న “ఛలో ఢిల్లీ – ఛలో రామ్‌లీలా మైదాన్” కార్యక్రమానికి హాజరుకావాలని ఈ సందర్భంగా స్టాలిన్‌ను ఆహ్వానించారు.
స్టాలిన్‌ను కలిసిన వారిలో రాకేష్ దత్తతో పాటు మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, ప్రొఫెసర్ సూరజ్ మండల్, రాజ్యసభ సభ్యులు విజ్ఞన్, ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ అధినేత కిరణ్ కుమార్, జయంత్ యాదవ్, రజినీకాంత్ గౌడ్ తదితరులు ఉన్నారు.
