తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం: పరిసరాల పరిశుభ్రతలో భాగంగా చేపట్టిన పది రోజుల స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని సీఎమ్సీ అధికారుల ఆదేశాల మేరకు వార్డ్ నెంబర్ 227, సర్కిల్ నెం.49, గోపినగర్ లోని బేబీ పాండ్ లేక్ లో సంబంధిత అధికారుల సమక్షంలో ఎస్ఆర్పి ఎస్ఎఫ్ఎ ల నేతృత్వంలో పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టి బేబీ పాండ్ లేక్ లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తీసివేసి శుభ్రంగా చేయడంతో స్థానికవాసులు సంతోషం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా స్థానిక కాలనీవాసులు మాట్లాడుతూ, అధికారులు విధి నిర్వహణలో అంకితభావాన్ని ప్రదర్శిస్తే తప్పనిసరిగా పరిసరాలు ఆరోగ్య వాతావరణాన్ని కలిగి ఉంటాయనేది అక్షర సత్యం అనే భావాన్ని వ్యక్తంచేశారు. బేబీ పాండ్ లేక్ ను పరిశుభ్రం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేశారు.
