హైదరాబాద్: బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సోమవారం చేనేత వర్గాల చైతన్య వేదిక ఆధ్వర్యంలో చేనేత కార్మికుల సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. తెలంగాణ చేనేత ఐక్య వేదిక అధ్యక్షులు రాపోలు వీరమోహన్ ఈ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.
చిక్క దేవదాసు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఐఏఎస్ టి. చిరంజీవులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చేనేత దినోత్సవ రూపకర్త ఎర్రమాద వెంకన్న నేత, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, ఆప్కో మాజీ డైరెక్టర్ కర్నాటి వెంకటేశం, ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డు మాజీ డైరెక్టర్ కర్నాటి ధనుంజయ, వివిధ చేనేత సహకార సంఘాల నాయకులు పాల్గొన్నారు.
