తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: మెదక్ జిల్లా యాదవ సంఘం ఆధ్వర్యంలో సదర్ సంబరాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ మందాడి అంజన్ కుమార్ యాదవ్, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ మారబోయిన రఘునాథ్ యాదవ్, బీసీ కులాల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దీపావళి సదర్ సమ్మేళనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తున్న యాదవ సంఘం పెద్దలకు ప్రజా ప్రతినిధులందరికీ ధన్యవాదాలు తెలిపారు. సంఘం సంఘటితంగా ఉన్నప్పుడే సమాజంలో మనకు ఒక గౌరవం ఉంటుందని అన్నారు. యాదవ్ యువత అన్ని రంగాల్లో ముందుకు రాణించాలని అన్నారు. విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో ముందంజలో రావాలని అన్నారు. ప్రభుత్వాలు కూడా పాడి పశువులపై సబ్సిడీలో యాదవ్ రైతులకు ఆవులు గాని గేదెలు గాని కొల్లు మేకలు గాని అందించాలని అన్నారు. గ్రామీణ ప్రాంతంలో రోజురోజుకి పశువులకు దానా లేక పాడి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. దీని మీద ప్రభుత్వం ద్రుష్టి సారించి ప్రభుత్వ స్థలాలు ప్రభుత్వ భూముల్లో మంజూరు భూముల్లో యాదవులకు స్థలాలు కేటాయించి పశువులు మేపడానికి అవకాశాలు కల్పించాలి బోర్వేల్స్ వేసి వాటికి దాన పచ్చిమేత అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు భారతదేశంలో యాదవులు సంపద సృష్టించడంలో ముందంజలో ఉన్నారని అన్నారు. వారికి ప్రభుత్వాలు అన్ని విధాల ఆదుకోవాలని అన్నారు. యాదవ్ సంఘాలు నాయకులు ప్రతి ఒక్కరు మన వాళ్ళని ఏకతాటిపై తెచ్చి మన వాళ్లకు రావాల్సిన విద్య ఉద్యోగ రంగాల్లో సామాజిక వాటి కోసం పోరాటం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు మల్లేష్ యాదవ్ సంగం సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా సదర్ మహోత్సవం ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా పెరుగు ఐలేష్ యాదవ్, రాజు యాదవ్, అశోక్ యాదవ్, గణేష్ యాదవ్, కృష్ణ యాదవ్, యాదవ సంఘం నాయకులు ప్రజా ప్రతినిధులు మెదక్ జిల్లా ప్రజలు పెద్దఎత్తున పాల్గొని సదర్ మహోత్సవం విజయవంతం చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపినారు. ఈ కార్యక్రమంలో యాదవ కార్పొరేషన్ చైర్మన్ రఘునాథ్ యాదవ్, జిల్లా అధ్యక్షుడు మల్లేశం యాదవ్, పట్టణ అధ్యక్షుడు బాలరాజ్ యాదవ్, చిన్న శ్రీశైలం, రాష్ట్ర యాదవ సంఘం ఉపాధ్యక్షుడు మురళీ యాదవ్, యాదవ సంఘం నాయకులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.