తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శ్రీ హేమ దుర్గాభవన్లోని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బండి రమేష్ ఆధ్వర్యంలో ముఖ్యమైన సమావేశం నిర్వహించారు. పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న బూత్ లెవల్ ఏజెంట్లకు వారి సంబంధిత పోలింగ్ బూతుల వారీగా బాధ్యతలు కేటాయిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ ప్రతి బూత్ లెవల్ ఏజెంట్ పార్టీ నిర్దేశించిన విధివిధానాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా తమకు కేటాయించిన పోలింగ్ బూతుల పరిధిలో ఓటు హక్కు పరిరక్షణకు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ఓటర్ల హక్కులను కాపాడటంలో బూత్ లెవల్ ఏజెంట్ల పాత్ర ఎంతో కీలకమని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం, పీసీసీ ఆదేశాల మేరకు నియమితులైన కోఆర్డినేటర్ నర్సిరెడ్డి మాట్లాడుతూ, బూత్ లెవల్ ఏజెంట్లు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని, పార్టీ నాయకత్వం సూచించిన మార్గదర్శకాలను పాటిస్తూ ఓటు హక్కు పరిరక్షణ కోసం సమన్వయంతో పనిచేయాలని వివరించారు. ఈ సమావేశంలో అన్ని డివిజన్ల అధ్యక్షులు, మాజీ డివిజన్ అధ్యక్షులు, మహిళా అధ్యక్షురాళ్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, బూత్ లెవల్ ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు
