తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, కొండాపూర్ మసీదుబండ గ్రామంలోని శ్రీ స్వయంభు శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో 24వ తేది మంగళవారం కార్తీక పౌర్ణమి పర్వదిన శుభ సందర్బంగ అధిక సంఖ్యలో ఆలయానికి భక్తులు విచ్చేసి శ్రీ వీరాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామి సన్నిధిలో కార్తీక పౌర్ణమి దీపాలను వెలిగించి భక్తిశ్రద్ధలతో ఆచార యుక్తంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగ భక్త జనులు మాట్లాడుతు, కార్తీక పౌర్ణమి రోజున 365 (మూడువందల అరవై ఐదు) దీపాలను వెలిగించినట్లయితే ఏడాదిపొడుగునా దీపారాధన చేసిన పుణ్యం లభిస్తుందని ప్రగాఢ విశ్వాసాన్ని తెలియజేశారు. ఆలయంలో కార్తీక పౌర్ణమి దీపాలను వెలిగించి ఏడాదిపొడుగునా దీపారాధన చేసిన అదృష్టాన్ని పొందే అవకాశాన్ని కలుగజేసిన శ్రీ స్వయంభు శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయ ధర్మకర్త మారబోయిన సందీప్ యాదవ్ కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని అన్నారు. ఈ సందర్భంగ మారబోయిన సందీప్ యాదవ్ మాట్లాడుతు, కార్తీక దీపాల వెలుగులు ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త ఆశలను నింపాలని, మీ కుటుంబాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు వెల్లివిరియాలని, చీకటిని తొలగించి వెలుగులు నింపే ఈ పవిత్ర కార్తీక పౌర్ణమి మీ జీవితాల్లో శాంతి, సంతోషం, విజయాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని, ప్రజలందరికీ హృదయపూర్వకంగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.
