తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్ : మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ ఆధ్వర్యంలో బ్లాక్ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, మున్సిపల్ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సభ్యులతో ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బండి రమేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పార్టీ అధిష్టానం అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. బ్లాక్, డివిజన్, మున్సిపల్ స్థాయిల్లో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని అన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ ఐక్యంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, డీసీసీ కార్యవర్గ సభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు మరియు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
