తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్, సురభికాలనీ సమీపంలోని హిందూ స్మశాన వాటిక ఇంచార్జ్ బ్యాగరీ రాజు స్మశాన వాటిక సమీపంలో వేస్తున్న చెత్తా, చెదారంపై ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ సందర్బంగ స్మశాన వాటిక ఇంచార్జ్ బ్యాగరీ రాజు మాట్లాడుతు, శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ, రాజీవ్ గృహకల్ప, సురభికాలనీలకు వెళ్ళే ప్రధాన రహదారి పక్కన ఉన్న హిందూ స్మశాన వాటిక ప్రవేశద్వార సమీపంలో రహదారిపై వెళ్ళే వాహనదారులు మరియు స్థానికవాసులు ఇండ్లలోని చెత్తా, చెదారాన్ని తీసుకువచ్చి పడవేయడంతో అపరిశుభ్రతతో, దుర్గంధంతో, దుర్వాసనతో అనారోగ్య వాతావరణాన్ని కల్పిస్తున్నందున, స్మశాన వాటికలో నిర్వహించే ఆచార వ్యవహారాల నిమిత్తం చేరుకునేవారందరూ కొంత సమయం వరకు స్మశాన వాటికలో గడపాల్సిన క్రమంలో కుళ్ళిన చెత్తనుండి వెలువడే దుర్వాసనతో తీవ్ర అసహనానికి గురై మానసిక వేదన చెందుతున్నారని తెలిపారు. కావున సంబంధిత అధికారులు చెత్తా, చెదారాన్ని తీసుకువచ్చి స్మశాన వాటిక ప్రవేశద్వార సమీపంలో పడవేయకుండా సత్వర చర్యలు చేపట్టి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లుగా బ్యాగరీ రాజు తెలిపారు.
