తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని మైలర్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలోని భావన ఋషి నగర్ శ్రీ మార్కండేయ పద్మశాలి ట్రస్ట్ భవన్‌లో ఈ నెల 28న ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ భక్త మార్కండేయ స్వామివారి ప్రత్యేక పూజలు, హోమం, గాయత్రీ ధారణ, అన్న వితరణ కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పండుగ సందర్భంగా కులబాంధవులందరూ ఐకమత్యంతో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు.
పద్మశాలి కులబాంధవులు, కుటుంబ సభ్యులు, మహిళలు, యువతీ యువకులు, పెద్దలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ట్రస్ట్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. కుటుంబ సమేతంగా సకాలంలో విచ్చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొని, అన్న వితరణను స్వీకరించాలని కోరారు.
రాఖీ పౌర్ణమి సందర్భంగా నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా ఆధ్యాత్మికతతో పాటు కులబాంధవుల మధ్య ఐక్యత, సోదరభావం, సేవాభావం మరింత బలపడాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.
