తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : హైదర్‌గూడలోని బాలాజీ మిఠాయి బండార్ సమీప కాలనీలో చాలా రోజులుగా వర్షపు నీరు నిలిచిపోవడంతో పాటు పైప్‌లైన్ సమస్య, రోడ్లపై గుంతల కారణంగా స్థానిక ప్రజలు, కాలనీవాసులు, వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమస్య పరిష్కారం కోసం స్థానికులు పలుమార్లు జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు స్పందించి వర్షపు నీటి పారుదల కోసం పైప్‌లైన్ ఏర్పాటు చేయడంతో పాటు బుధవారం సీసీ రోడ్డు నిర్మాణ పనులను చేపట్టారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల పార్లమెంట్ కన్వీనర్ నారగూడెం మల్లారెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కాడెం సుధాకర్, సాబాధ విజయ్‌కుమార్, రాచూరి రాజశేఖర్, రాజ్‌కుమార్, బీట్కూరి సతీష్, వర్క్ ఇన్‌స్పెక్టర్ రాజు, సాయితేజతో పాటు కాలనీ పెద్దలు పాల్గొన్నారు.
