తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : నేతాజీనగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కృష్ణ జన్మాష్టమి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రాధా కృష్ణుల వేషధారణలో ముస్తాబై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చిన్నారులు నృత్యాలు చేస్తూ, ఉట్టి కొడుతూ సందడి చేశారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయురాలు బి. ప్రమీల మాట్లాడుతూ, శ్రీకృష్ణుడి బాల్య ఘట్టాలను గుర్తుచేసుకుంటూ విద్యార్థులతో వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో మన సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన పెరుగుతుందని తెలిపారు విద్యా ర్థులు ఉత్సాహంగా పాల్గొనడం అభినంద నీయమన్నారు..కార్యక్రమంలో ఉపాధ్యాయులు మమత, మహేశ్వర్, లక్ష్మి, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.
